nagendra haraya trilochanaya lyrics in telugu

nagendra haraya trilochanaya lyrics in telugu

nagendra haraya trilochanaya lyrics in telugu
nagendra haraya trilochanaya lyrics in telugu

     nagendra haraya trilochanaya lyrics in telugu

శివుడిని మరియు న, మ, శి, వా, య, గా పిలవబడే పవిత్రమైన పంచాక్షరాల శక్తిని కీర్తించే శివపంచాక్షర స్తోత్రాన్ని సౌండ్స్ అఫ్ ఈశా ఆలపిస్తున్నారు.

శివుడిని మరియు న, మ, శి, వా, య, గా పిలవబడే పవిత్రమైన పంచాక్షరాల శక్తిని కీర్తించే శివపంచాక్షర స్తోత్రాన్ని సౌండ్స్ అఫ్ ఈశా ఆలపిస్తున్నారు.

లిరిక్స్తెలుగు

ॐ నమః శివాయ శివాయ నమః ॐ

ॐ నమః శివాయ శివాయ నమః ॐ

నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై “న” కారాయ నమః శివాయ

మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై “మ” కారాయ నమః శివాయ

శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

తస్మై “శి” కారాయ నమః శివాయ

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై “వ” కారాయ నమః శివాయ

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై “య” కారాయ నమః శివాయ

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

Sanskrit

nagendra haraya trilochanaya lyrics in telugu

భావం

siva panchaksharam lyrics in telugu
siva panchaksharam lyrics in telugu

నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు గలవాడు,

పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకొన్న వాడు, మహేశ్వరుడు, నిత్యుడు,

శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ‘న’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.

మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు

నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు,

మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ‘ మ’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.

మంగళకరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయింపజేసే సూర్యుడు,

దక్షుని యజ్ఞం నాశనం చేసిన వాడు,

నీలకంఠుడు, వృషభధ్వజుడు,

పంచాక్షరీ మహామంత్రంలో ‘శి’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.

వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునిశ్రేష్ఠులచే మరియు సకల దేవతలచే పూజింపబడే వాడు,

విశ్వమంతటికీ కిరీటం వంటి వాడు (శేఖరుడు), సూర్య చంద్ర, అగ్నులను మూడు కన్నులుగా కలిగినవాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ‘ వ’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.

యజ్ఞస్వరూపుడు, జటాధరుడు, త్రిశూలం ధరించిన వాడు, సనాతనుడు, తేజస్సు కలవాడు,

నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు,

పంచాక్షరీ మహామంత్రంలో ‘ య’ కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము.

ఈ పంచాక్షరీ స్తోత్రమును శివసన్నిధిలో జపించువారు, శివలోక ప్రాప్తి కలిగి బ్రహ్మానందులై ఉందురు.

. Watch Video

Leave a comment